ENGLISH

చిరంజీవి తరవాత నాగార్జునని లైన్లో పెట్టిన రావిపూడి

21 December 2024-12:05 PM

ఓటమి తెలియని దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి. ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీయటంలో అనిల్ దిట్ట. పైగా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చునే విధంగా ఉంటాయి అనిల్ సినిమాలు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తాడు. పటాస్, F2, F3 ఈ కోవకు చెందినవే. తరవాత వచ్చిన భగవంత్ కేసరి మెసేజ్ ఇస్తూ హీరోయిజంతో పాటు ఎమోషన్స్ ని ఎలివేట్ చేసాడు. ఇపుడు మళ్ళీ వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో పండగ బరిలో దిగుతున్నాడు. దీనితో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టాడు అనిల్.

ఈ సారి మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం చిరు 'విశ్వంభర' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తి అయ్యాక అనిల్ రావి పూడితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారట. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కి చిరంజీవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడని ఫాన్స్ భావిస్తున్నారు. చిరు స్టెప్పులు, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు అనిల్ మార్క్ ఎంటర్టైనింగ్ కామెడీ కూడా అదిరిపోతోంది అని అంచనా వేస్తున్నారు. చిరు తర్వాత కూడా అనిల్ ఎవరితో వర్క్ చేయనున్నాడో ముందే క్లారిటీ ఇచ్చేసాడు.

మొదట వెంకటేష్ తో, తరవాత బాలయ్యతో, ఇప్పడు చిరుతో వర్క్ చేస్తున్న అనిల్ రావి పూడి నెక్స్ట్ కింగ్ నాగార్జునను లైన్ లో పెట్టాడని టాక్. ఇదివరకే వీరి కలయికలో సినిమా రావాల్సి ఉండగా ఎందుకో ఆగింది. కానీ ఈ సారి పక్కా అని హింట్ ఇస్తున్నాడు అనిల్ రావిపూడి. నాగ్ కి కూడా ప్రజంట్ మంచి హిట్ అవసరం, నాగార్జున ఈ మధ్య మల్టీస్టారర్లు చేస్తున్నాడు తప్ప సోలోగా ఒక్క మూవీ కూడా కమిట్ అవలేదు. నాగ్ నుంచి చివరిగా వచ్చిన సినిమా 'నా సామిరంగ'. లో కూడా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఉన్నారు. నాగ్ ప్రజంట్ చేస్తున్న 'కూలీ', 'కుబేర' కూడా మల్టీ స్టారర్లే.