ENGLISH

'ఆక్సిజన్‌'తో హీటెక్కించేస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్‌

05 October 2017-14:38 PM

ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి గ్లామర్‌లో నో లిమిట్స్‌ అంటోంది. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే గ్లామర్‌ తప్పని సరి అంటోంది. 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. తొలి సినిమాలో సాదా సీదాగా కనిపించినప్పటికీ కుర్రకారుకు ఏదో మ్యాజిక్‌ చేసేసింది. ఆమె అందచందాలకు కుర్రకారు గులామైపోయారు. 'కిట్టుగాడున్నాడు జాగ్రత్త' సినిమాలో యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించేసి మరింత హీటు పుట్టించేసింది. తాజాగా గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆక్సిజన్‌' సినిమాతో మన ముందుకు రాబోతోంది. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌ కంచెలు దాటేసింది. పోస్టర్స్‌లో అమ్మడి హాట్‌నెస్‌కి అబ్బాయిలు గుండె జారి గల్లంతయ్యిందే.. అంటూ తమ హార్ట్‌ని వెతుక్కుంటున్నారు పాపం. అంతగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో హాటెనెస్‌ చూపించేసిందట. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లోనూ అమ్మడు హాట్‌గానే కనిపించింది. మరో హాట్‌ బ్యూటీ రాశీఖన్నా ఈ సినిమాలో నటిస్తోంది. అయితే రాశీఖన్నాని మించిన హాట్‌నెస్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌దేనట ఈ సినిమాలో. ఈ హాట్‌నెస్‌తోనే అమ్మడు వరుస అవకాశాలు దక్కించేసుకుంటుందో ఏమో. ఓ పక్క అల్లు అర్జున్‌ మూవీలోనూ, మరో పక్క పవర్‌స్టార్‌ మూవీతో పాటు, పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాక తమిళ సినిమాలతోనూ బిజీగా ఉంది బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌.

ALSO READ: మోహన్ బాబు నుండి డా. మోహన్ బాబు