ENGLISH

హాట్ బ్యూటీకి కరోనా అలా కలిసొచ్చిందట

04 January 2021-16:00 PM

హాట్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్, తెలుగులో ‘మజ్ను’, ‘అజ్నాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో నటించిన విషయం విదితమే. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలతో బిజీగా వుంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకోవడం, ఇంతలోనే కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా, ఆమె కెరీర్ కొంత డీలా పడింది.

 

ఇంతకీ కరోనా సీజన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్ ఏం చేసిందట.? ఈ ప్రశ్నకు ఆమె బదులిస్తే, కరోనా సీజన్‌లో తాను సినిమా గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నాననీ, డాన్సుల్లో ప్రావీణ్యం సంపాదించాననీ చెప్పుకొచ్చింది. స్టడీస్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందట ఈ బ్యూటీ. కరోనా కారణంగా అందరిలానూ తానూ లాక్ డౌన్ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాననీ, ఆన్ లైన్ ద్వారా వివిధ అంశాలపై అవగాహన పెంచుకున్నాననీ, స్నేహుతుల్ని కూడా ఆన్ లైన్ వేదికగానే కలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్.

 

కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా సినిమా పరిశ్రమ నుంచి కొంత బ్రేక్ తీసుకున్నానని చెప్పిన అనూ, ముందు ముందు కెరీర్‌లో వేగం పెరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది. తెలుగుతోపాటు, పలు భాషల్ని ఈ లాక్ డౌన్ సమయంలో నేర్చకున్నట్లు వెల్లడించింది అనూ ఇమ్మాన్యుయేల్. గ్లామర్ పరంగా పెద్ద మార్పులేమీ లేవనీ, వీలైనంత వరకు వర్కవుట్స్ చేశానని ఫిట్‌గా వుండటమంటే, ఆరోగ్యంగా వుండడమని ఓ ప్రశ్నకు బదులిచ్చింది ఈ బ్యూటీ.

ALSO READ: మ‌న‌కెప్పుడు 100కి 100?