ENGLISH

Anu Emmanuel: అనూ ఇమ్మానియేల్‌.. ఎంత తీసుకొందో తెలుసా?

09 November 2022-11:00 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసినా... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చుకోలేక‌పోయింది అనూ ఇమ్మానియేల్. అనూ చేతిలో ఒక్క‌టంటే ఒక్క బ్లాక్ బ‌స్ట‌రూ లేదు. దాంతో.. అనూ కెరీర్ బాగా స్లో అయిపోయింది. ఇటీవ‌ల విడుద‌లైన `ఊర్వ‌శివో.. రాక్ష‌సివో` త‌న‌కు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఈ సినిమాలో అనూ ఇమ్మానియేల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. దాంతో పాటు లిప్ లాకుల‌కూ, హాట్ సీన్ల‌కు ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌లేదు. ఎలాంటి పాత్ర‌ల‌కైనా, ఎలాంటి సీన్ల‌కైనా త‌న‌కు ఓకే అనే సంకేతాలు పంపింది. ఈ సినిమా చూశాక‌... అనూకి ఇంకొన్ని ఆఫ‌ర్లు రావ‌డం అయితే గ్యారెంటీ.

 

అయితే.. `ఊర్వ‌శివో` కోసం రూ.35 ల‌క్ష‌ల పారితోషికం తీసుకొంద‌ట అనూ. ఈ సినిమా త‌న‌కు ప్ల‌స్ అయ్యేస‌రికి పారితోషికం కూడా పెంచేసింది. ఇప్పుడు రూ.50 ల‌క్ష‌లు చేసేసింది. అయినా అనూకి రూ.50 ల‌క్ష‌లు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీగానే ఉన్నారు. `ఊర్వ‌శివో` త‌ర‌వాత అను మ‌రో రెండు సినిమాల‌కు సంత‌కాలు చేసింద‌ని, అందులో గీతా ఆర్ట్స్ సినిమా కూడా ఉంద‌ని స‌మాచారం. మ‌రో హిట్టు ప‌డితే.. అనూ ఏకంగా రూ.కోటి డిమాండ్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

ALSO READ: బాల‌య్య ప్ర‌యోగాత్మ‌క చిత్రం.. ఎవ‌రితోనో తెలుసా?