ENGLISH

అనుష్క కేరవాన్ సీజ్‌..!

01 June 2017-10:54 AM

అనుష్కకు ఓ గ‌ట్టి షాక్ త‌గిలింది.  ఆమె ఉపయోగిస్తున్న కేరవాన్ ను  రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.ప్ర‌స్తుతం ‘భాగమతి’  షూటింగ్‌లో బిజీగా ఉంది అనుష్క‌. ఈ షూటింగ్ పొలాచ్చీలో జ‌రుగుతోంది. అక్క‌డ అనుష్క ఉపయోగిస్తున్న కేరవాన్ కి ఎలాంటి అనుమ‌తి ప‌త్రాలూ లేవ‌ట‌. అందుకే.. ర‌వాణా శాఖ అధికారులు సీజ్ చేసి స్వాధీనం చేసుకొన్నారు. ఈ సంఘ‌ట‌న షూటింగ్ సెట్లో కాస్త క‌ల‌క‌లం సృష్టించింది. అనుష్క వాడుతోంది.. సొంత కేరా వానా?  లేదంటే ప్రైవేటు కేరా వానా? అనే విష‌యాలు తెలియాల్సివుంది. ఇది అనుష్క సొంత కేరా వాన్ అయితే.. ర‌వాణా శాఖ అధికారుల‌కు స్వీటీ స‌మాధానం చెప్పాల్సిందే.

ALSO READ: షూటింగ్ లో గాయపడ్డ అజిత్?!