ENGLISH

అట‌కెక్కిన అనుష్క సినిమా?

14 July 2021-12:13 PM

ఏంటో.. అనుష్క‌కి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. బాహుబ‌లి త‌ర‌వాత త‌న‌కొచ్చిన క్రేజ్ ని, ఫేమ్ నీ ఏమాత్రం స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది అనుష్క‌. బాహుబ‌లి త‌ర‌వాత‌.. చాలా గ్యాప్ తీసుకుని నిశ్శ‌బ్దం చేసింది. అది అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత‌... న‌వీన్ పొలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తుంద‌ని, అది స్వీటీకి క‌మ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంద‌ని అనుకున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేష‌న్స్ నిర్మించాలి. అయితే... ఈ సినిమాపై ఇప్ప‌టికీ చిత్ర‌బృందం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌ని టాక్‌. ఈ సినిమాని ప్ర‌స్తుతానికి హోల్డ్ లో పెట్టార‌ని, ఎప్పుడు తెర‌కెక్కుతుందో తెలీద‌ని, ఈ సినిమా ప‌ట్టాలెక్క‌క‌పోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని తెలుస్తోంది.

 

నిజానికి ప‌రిమిత బ‌డ్జెట్లో ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమాగా దీన్ని తెర‌కెక్కించాల‌నుకున్నారు. అయితే.. అనుష్క భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయ‌డం, న‌వీన్ పొలిశెట్టి వ‌రుస సినిమాలతో బిజీగా ఉండ‌డంతో.. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ల‌డానికి మొరాయిస్తుంద‌ని టాక్‌. పోనీ.. అనుష్క స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని తీసుకుందామ‌నుకుంటే, ఈ ప్రాజెక్టుకి అంత క్రేజ్ రాద‌ని భ‌య‌ప‌డుతున్నార్ట‌. అందుకే.. ప్ర‌స్తుతానికి హోల్డ్ లో పెట్టార‌ని తెలుస్తోంది. సో.. స్వీటీని వెండి తెర‌పై చూడాలంటే మ‌రికొన్నాళ్లు ఆగాల్సిందే.

ALSO READ: జాన్వీలో మ‌రో యాంగిల్