ENGLISH

అనుష్క కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నదట

04 October 2017-13:53 PM

దీపముండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలి అన్న సామెతని ఈతరం నటీమణులు బాగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. వారి కెరీర్ మంచి టైమింగ్ లో ఉన్నప్పుడే తమ డబ్బుని వేరే వేరే రంగాల్లో పెట్టుబడి పెడుతుండడంతో వారి భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇదే కోవలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ త్వరలోనే వస్త్ర వ్యాపార రంగంలోకిఅడుగుపెట్టనుంది. దీనికి కావాల్సిన పనులు ఇప్పటికే పూర్తిచేసిన అనుష్క, వచ్చే నెలలో తన బ్రాండ్ వస్త్రాలతో మార్కెట్ లోకి అడుగుపెడుతున్నది.

తనకి రంగంలోకి అడుగుపెట్టాలని చాలా రోజుల నుండి ఆలోచిస్తునట్టు అది ఇప్పటికి నెరవేరినట్టు తెలిపింది. ఇప్పటికే అనుష్క బాయ్ ఫ్రెండ్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లి ఈ రంగంలో అడుగుపెట్టగా ఇప్పుడు అనుష్క కూడా ఇందులోకి రానుంది.

మొత్తానికి.. నేటి సినీతారాలే రేపటి వ్యాపారవేత్తలు అని అర్ధమవుతుంది.

 

ALSO READ: రెండవ పెళ్ళి పై రేణు దేశాయ్ పోస్ట్ రేపిన కలకలం