ENGLISH

శ్రుతి ప్లేస్‌లో స్వీటీ..??

30 May 2017-11:19 AM

సంఘ‌మిత్ర టీమ్ నుంచి శ్రుతిహాస‌న్ త‌ప్పుకొంది. ఈ సినిమాలో నేను చేయ‌డం లేదు.. అని శ్రుతి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. అటు చిత్ర‌బృందం కూడా `శ్రుతి స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని తీసుకొంటున్నా` అని క్లారిటీ ఇచ్చింది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కమైన ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రుతి ఎందుకు త‌ప్పుంకొంది?  అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. దాంతో పాటు శ్రుతి ప్లేసులోకి ఎవ‌రొస్తారు??  అనే విష‌యంపైనా ఫోక‌స్ పెరిగింది. ఆ ప్లేసు క‌చ్చితంగా అనుష్క‌దే అన్న‌ది టాలీవుడ్ టాక్‌. గుర్ర‌పు స్వారీ, క‌త్తి యుద్దాల్లో అనుష్క ప్రావీణ్యం అంద‌రికీ తెలిసిందే. పైగా బాహుబ‌లి సినిమాల‌తో.. త‌న పాపులారిటీ మ‌రింత పెంచుకొంది. సో... శ్రుతి త‌ప్పుకోవ‌డంతో అనుష్క లైన్ క్లియ‌రైంద‌ని కొంద‌రంటుంటే, అనుష్క‌ని తీసుకోవ‌డానికే శ్రుతిని త‌ప్పించార‌ని మ‌రి కొంద‌రు వాదిస్తున్నారు. మొత్తానికి సంఘ‌మిత్ర‌గా స్వీటీని చూడ‌డం ఖాయం...!

ALSO READ: RAJAMOULI'S SHOCKING BOLD STATEMENT