ENGLISH

ఈ హాట్‌ పాపకి ఆఫర్లు పోటెత్తేస్తున్నాయట!

04 January 2021-11:00 AM

అన్వేషీ జైన్‌.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌.! సోషల్‌ మీడియా వేదికగా హాట్‌ హాట్‌ పొటోల్ని, వీడియోల్ని షేర్‌ చేస్తూ, కుర్రాళ్ళను 'ఎ'డ్యుకేట్‌ చేయడమే కాదు, వారితో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ.. తన ఇమేజ్‌ని, తనకున్న ఫాలోయింగ్‌నీ అనూహ్యంగా పెంచుకున్న ఈ బ్యూటీ, తాజాగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. 'కమిట్‌మెంట్‌' అంటూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న ఈ బ్యూటీ.. ఇప్పటికే అవసరమైన మేర టాలీవుడ్‌లో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసేసింది. ఓ వైపు వెబ్‌ సిరీస్‌ ఛాన్సులు, ఇంకోపక్క సినిమా ఛాన్సులతో అన్వేషి జైన్‌ కెరీర్‌ టాలీవుడ్‌లో ముందు ముందు ఓ రేంజ్‌లో వుండబోతోందట.

 

'టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. మంచి కథల్ని ఎంపిక చేసుకోవడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాను. హాట్‌గా తెరపై కన్పించడం నేరమేమీ కాదు. నా పరిమితులు నాకున్నాయ్‌ గ్లామర్‌ విషయంలో' అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అన్వేషి జైన్‌. ప్రత్యేకించి 'అడల్ట్‌ రేటెడ్‌' సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో మాత్రమే నన్ను ఇష్టపడ్తారన్న వాదనను తాను అంగీకరించబోననీ, అది కూడా నటలో భాగమేననీ చెప్పిన అన్వేషి జైన్‌, ఇప్పుడు ట్రెండ్‌ మారిందనీ.. గ్లామర్‌ - వల్గారిటీ హద్దులు చెరిగిపోయాయనీ, కంటెంట్‌ని బట్టి ఏ స్థాయి గ్లామర్‌ అయినా తప్పేమీ కాదని చెప్పింది. తెలుగు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట అన్వేషీ జైన్‌కి. కష్టంగానే వున్నా, ఇష్టంగానే తెలుగు భాషని నేర్చేసుకుంటుందట ఈ బ్యూటీ.

ALSO READ: 2024లో సినిమా.. ఇప్పుడెందుకీ హంగామా.?