ENGLISH

త‌మిళ హీరోకి అరెస్టు వారెంటు

07 October 2017-15:32 PM

త‌మిళ హీరో  జై తెలుసు క‌దా. జ‌ర్నీ,  రాజా-రాణి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యాడు. అంజ‌లితో ప్రేమ వ్య‌వ‌హారంతో... మ‌రింత పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు జై క‌ష్టాల్లో ప‌డ్డాడు. ఏ క్ష‌ణంలో అయినా జై అరెస్టు కావొచ్చు. లేదంటే పోలీసుల‌కు లొంగిపోవొచ్చు.   ఇటీవ‌ల‌ చెన్నై లోని అడయార్  ద‌గ్గ‌ర  జై న‌డుపుతున్న కారు డివైడర్‌ని ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో జై మ‌ద్యం తాగి కారు న‌డుపుతున్నాడ‌న్న‌ది పోలీసుల అభియోగం. ఇందుకు సంబంధించి కేసు కూడా న‌మోదు చేశారు.  సైదా పేట కోర్టులో ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. విచార‌ణ‌కు రావాల్సిందిగా జైకి స‌మ‌న్లు వ‌చ్చినా రెండు సార్లు డుమ్మా కొట్టాడు. దాంతో కోర్టు ఆగ్ర‌హించింది. జై ఎక్క‌డున్నా స‌రే, అరెస్టు చేసి కోర్టు ముందు హాజ‌రు ప‌ర‌చాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో జై ఇబ్బందుల్లో ప‌డ్డాడు. జై అరెస్టు వ‌ర‌కూ తెచ్చుకొంటాడా, లేదంటే కోర్టులో లొంగిపోతాడా అనేది ఆసక్తిగా మారింది.

ALSO READ: నీరుగారిన మ‌హేష్ ఆశ‌లు