ENGLISH

ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌విత్వం.. ఎవ‌రి కోస‌మో తెలుసా?

27 April 2021-09:39 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి చ‌దువ‌రి. చాలా పుస్త‌కాలు చ‌దివాడు. ఎప్పుడు చూసినా. ఏదో ఓ పుస్త‌కం చేతిలో ప‌ట్టుకుని క‌నిపిస్తుంటాడు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో మ‌రో కోణం బ‌య‌ట ప‌డింది. త‌ను క‌విత్వం కూడా రాశాడ‌ట‌. అందులోనూ ఓ న‌టి కోసం. ఈ విష‌యాన్ని జ్యోతి బ‌య‌ట‌పెట్టింది.

 

బండ జ్యోతి అని పిలిచుకునే ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. వ్యాంప్ త‌ర‌హా పాత్ర‌ల‌కు త‌ను ప్ర‌సిద్ధి. ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని పంచుకుంది. ఓ సినిమాలో ప‌వ‌న్ తో క‌లిసి న‌టిస్తున్న‌ప్పుడు... జ్యోతిపై కొన్ని క‌విత‌లు రాశాడ‌ట ప‌వ‌న్‌. ``ప‌వ‌న్ లాంటి పెద్ద స్టార్ నా కోసం క‌విత్వం రాయ‌డం ఆనందాన్ని క‌లిగించింది`` అని చెబుతోంది జ్యోతి. షూటింగ్ స‌మ‌యంలో చాలామంది త‌న‌ల్ని మాట‌ల‌తో, చూపుల‌తో ప‌డేయ‌డానికి చూశార‌ని, కానీ తాను సీరియ‌స్ గా తీసుకోలేద‌ని చెప్పుకొచ్చింది. అన్న‌ట్టు జ్యోతికి పెళ్ల‌య్యింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకుంది. తన‌కు మ‌ళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యాలు లేవ‌ని, కానీ ఎవ‌రైనా మంచి కుర్రాడు క‌నిపిస్తే డేటింగ్ చేస్తాన‌ని అంటోంది.

ALSO READ: దేవిశ్రీ పాత ట్యూన్లు వ‌ద‌ల‌డా?