ENGLISH

హీరోయిన్ పై కన్నడ నిర్మాత వేదింపులు?!

07 June 2017-18:59 PM

ఫిలిం ఇండస్ట్రీ లో హీరోయిన్స్ పై వేదింపుల సమస్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.

వెలువడుతున్నకధనాల ప్రకారం, అవంతికా శెట్టి అనే నటి తన పై కన్నడ చలనచిత్ర పరిశ్రమ కి నిర్మాత కే సురేష్ వేదింపులకి తెగబడినట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.

రాజు కన్నడ మీడియం అనే కన్నడ చిత్రానికి తనని హీరోయిన్ గా తీసుకున్నప్పటి నుండి తన పైన వేదింపులు మొదలయ్యాయి అని చెప్పింది. తన నటన బాగలేదంటూ చెప్పడం అలాగే తన పాత్రకి సంబంధించి తొంబై శాతం షూటింగ్ పూర్తయ్యాక తనని వెనక్కి వెళ్ళిపోమ్మని వేదించినట్టు తన బాధని వెళ్ళగక్కింది.

ఈ విషయమై కన్నడ ఫిలిం ఛాంబర్ లో తాను ఫిర్యాదు కూడా చేసినట్టు తన పోస్టింగ్ లో బయటపెట్టింది. ఇలాంటి వేదింపులు సర్వసాధారణం అయిపోవడం భాదాకరం.

 

ALSO READ: బాలయ్య-పూరి టైటిల్ వింటే స్టన్ అవ్వాల్సిందే!