ENGLISH

చిక్కితే... ఛాన్సులు ద‌క్కిన‌ట్టే!

19 June 2021-15:01 PM

అవికా గోర్ గుర్తుంది క‌దా. ఉయ్యాలా జంపాలా అంటూ.. ఉర్రూత‌లూగించింది. సినిమా చూపిస్త మావ‌తో.. అంద‌ర్నీ హోల్ సేల్ గా బుట్ట‌లో ప‌డేసింది. హీరోయిన్ గా టాప్ పొజీష‌న్ లో ఉండ‌డం ఖాయం అనుకున్న ద‌శ‌లో.. స‌డ‌న్ గా మాయ‌మైపోయింది. బాగా ఒళ్లు చేసి, బొద్దుగా మారిపోవ‌డంతో ద‌ర్శ‌కులు అవికాని `లైట్` తీసుకున్నారు. ఆ త‌ప్పు గ్ర‌హించిందేమో? జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేసి, బాగా తగ్గింది.

 

ఎంత‌గా అంటే.. ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా. చిక్కితే చిక్కింది గానీ, ఛాన్సులు మాత్రం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా రెండు తెలుగు సినిమాల్లో సంత‌కాలు చేసింది. అందులో నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` ఒక‌టుంది. అయితే అవికా మ‌రీ జీరో సైజ్ కి రావ‌డం చూసిన ఆమె అభిమానులు `బొద్దుగా ఉన్న‌ప్పుడే బాగుంది` అనే కామెంట్లు విసురుతున్నారు.

ALSO READ: Avika Gor Latest Photoshoot