ENGLISH

ఆహాకి.... బాలయ్య అదిరిపోయే షాక్‌

29 January 2022-11:00 AM

ఆహాలో బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ షోతో ఆహా వీక్ష‌కుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆహాకి క‌నీ వినీ ఎరుగ‌ని మైలేజీ వ‌చ్చింది. నిజానికి ఈ షో ఇంత స‌క్సెస్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. దాంతో ఇప్పుడు సీజ‌న్ 2 కోసం ఆత్రుత ఆస‌క్తి మొద‌లైపోయింది.

 

సీజ‌న్ 1 హిట్ట‌యితే సీజ‌న్ 2 చేద్దామ‌నుకున్నారు. అందుకే బాల‌య్య‌తో సీజ‌న్ 1 వ‌ర‌కూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో ఎపిసోడ్ కీ రూ.40 ల‌క్ష‌లు ఇచ్చేలా ఎగ్రిమెంట్ కుదిరింది. ఫ‌స్ట్ సీజ‌న్ అంతా ఇలానే న‌డిచింది. ఇప్పుడు రెండో సీజ‌న్‌కి వ‌చ్చేస‌రికి బాల‌య్య రేటు పెంచేశాడు. ఒక్కో ఎపిసోడ్ కీ.. రూ.60 ల‌క్ష‌లు ఇవ్వాల‌న్న‌ది బాల‌య్య డిమాండ్. అంటే... 50 శాతం రెమ్యున‌రేష‌న్ పెంచాడ‌న్న‌మాట‌. ప‌ది ఎపిసోడ్లు లెక్క గ‌ట్టినా... రూ.6 కోట్లు ఇవ్వాల్సిందే. అయితే.. గీతా ఆర్ట్స్ కూడా బాల‌య్య అడిగినంత ఇవ్వ‌డానికి రెడీ అయిపోయింది. సో.. త్వ‌ర‌లోనే సెకండ్ సీజ‌న్‌కి కొబ్బ‌రి కాయ కొడ‌తారన్న‌మాట‌. ఈ సీజ‌న్‌లో చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వాళ్లొస్తే... సీజ‌న్ 2 కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వ్వ‌డం ఖాయం.

ALSO READ: హే రామ్‌... షారుఖ్ ఖాన్ కి ఏమైంది?