ENGLISH

Veera Simha Reddy: సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ విశ్వరూపం

22 October 2022-09:30 AM

బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కలయికలో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. అదే టైటిల్‌ ఖరారు చేసింది చిత్ర యూనిట్. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌.. క్యాప్షన్ కూడా వుంది. కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద టైటిల్ విడుదల చేశారు.

 

గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ.. ‘‘ఒక బాలకృష్ణ అభిమాని.. ‘సమరసింహారెడ్డి’ ఫ్యాన్‌.. ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ‘వీరసింహారెడ్డి’. బాలయ్యను అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకు రెండింతలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. సంక్రాంతికి వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు. బాలకృష్ణ విశ్వరూపం చూస్తారు'' అని చెప్పుకొచ్చారు.

ALSO READ: Ori Devuda Review: 'ఓరి దేవుడా' మూవీ రివ్యూ &రేటింగ్!