ENGLISH

బాల‌య్య సినిమాకి ఎన్ని క‌ష్టాలో?

31 December 2020-15:05 PM

స్టార్ హీరో సినిమా అంటే.. న‌ల్లేరుపై న‌డ‌కే. అందునా బిజినెస్ విష‌యంలో.. కొబ్బరి కాయ కొట్ట‌క‌ముందే, ఆ సినిమాల‌కు బిజినెస్ మొద‌లైపోతుంది. ఏరియాల వారిగా అడ్వాన్సులు అందేస్తాయి. శాటిటైల్‌, డిజిట‌ల్ రైట్స్ రూపంలో ముందే డ‌బ్బులు వ‌చ్చేస్తాయి. కాబట్టి... ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లూ ఉండ‌వు.

 

అయితే... అదేంటో నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా విష‌యంలో మాత్రం బ‌య్య‌ర్లెవ‌రూ ఆసక్తి చూపించ‌డం లేద‌ని టాక్‌. ఈ సినిమాకి ముందు నుంచీ స‌మ‌స్య‌లే. బాల‌య్య‌కు త‌గిన క‌థానాయిక‌లు దొర‌క‌లేదు. వెదికి వెదికి వేసారి.. చివ‌రికి.. దొరికిన వాళ్ల‌తో సంతృప్తి ప‌డాల్సివ‌చ్చింది. ఈ సినిమా లో ప్ర‌తినాయ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నా, ఎవ్వ‌రినీ ఫైన‌ల్ చేయ‌లేదు. ఈ సినిమా బ‌డ్జెట్ ఎక్కువైపోయింద‌ని, ఈ విష‌యంలో నిర్మాత‌కూ, బోయ‌పాటి శ్రీ‌నుకి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకి ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయ‌ని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల ఈసినిమాని ఆపేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయ‌ని, ఈసినిమాకి ఫైనాన్స్ కూడా దొర‌క‌డం లేద‌ని టాక్‌. మ‌రి ఈ విష‌యం ఎంత వ‌ర‌క‌రూ నిజ‌మో, ఏమో..? ఈ స‌మ‌స్య‌లన్నీ ఎప్పుడు తిరిపోతాయో..?

ALSO READ: ప్ర‌భాస్ చేతుల మీదుగా 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ విడుద‌ల‌