ENGLISH

బాలయ్య - బోయపాటి సైలెన్స్‌ వీడినట్లేనా.?

28 January 2020-13:00 PM

సక్సెస్‌ఫుల్‌ అండ్‌ సెన్సేషనల్‌ కాంబో అయిన బాలయ్య - బోయపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే, రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదు. ఈలోగా సినిమాపై రకరకాల రూమర్స్‌ సర్క్యులేట్‌ అవుతూ వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని తెలుస్తోంది. ఈలోగా సినిమాకి సంబంధించిన ఆల్‌ షెడ్యూల్‌ షూటింగ్స్‌, లొకేషన్‌ ప్లానింగ్స్‌ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడట దర్శకుడు బోయపాటి. వన్స్‌ సెట్స్‌ మీదికెళ్లగానే షూటింగ్‌ ఫాస్ట్‌ ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేయడమేనట. అంతేకాదు, లేట్‌గా స్టార్ట్‌ చేసినా, లేటెస్ట్‌గా సినిమాని పూర్తి చేసే యోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. కంటిన్యూస్‌గా సినిమాని పూర్తి చేసి, సమ్మర్‌ రిలీజ్‌కి అంటే జూలైలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

బాలయ్య 106వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కేథరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో హీరో శ్రీకాంత్‌ని విలన్‌గా చూపించనున్నాడు బోయపాటి. విలనిజం శ్రీకాంత్‌కి కొత్త కాకపోయినా, బోయపాటి దించే విలన్‌ అంటే ఆ లెక్కలు నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ALSO READ: Catherine Tresa Latest Photoshoot