ENGLISH

బాలకృష్ణ 101వ సినిమాలో గెటప్ ఇదేనా?!

04 June 2017-13:39 PM

బాలకృష్ణ-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇలాంటి తరుణంలో బాలయ్య లుక్ అంటూ ఓ చిత్రం ఇప్పుడు అంతర్జాలంలో సందడి చేస్తుంది. ఇప్పటికే బాలయ్య ఈ చిత్రంలో ఒక డాన్ పాత్రలో కనిపించనున్నాడని అది ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతున్న ఫొటోనే అని ఫిలిం నగర్  లో టాక్.

అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక షూటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం యూనిట్ పోర్చుగల్ లో ఉందని సమాచారం.

 

ALSO READ: కాంగ్రెస్ అనుకూల ట్వీట్ చేసిన పవన్