ENGLISH

మాస్‌ మసాలా 'పైసా వసూల్‌'

10 June 2017-11:52 AM

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. మాస్‌ మసాలా టైటిల్‌ని ఈ సినిమాకి ఎంచుకున్నారు. ఇంతకీ ఏంటో తెలుసా ఆ టైటిల్‌ 'పైసా వసూల్‌'. చాలా క్యాచీగా ఉంది కదా. బాలయ్య అభిమానులు ఈ టైటిల్‌ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. ముస్కాన్‌ సేథి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ముద్దుగుమ్మ శ్రియ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. కైరా దత్‌ ఐటమ్‌ సాంగ్‌ సినిమాకి మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. టైటిల్‌ అనౌన్స్‌ చేస్తూ, సినిమా స్టిల్స్‌ కూడా రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. బాలకృష్ణ మాస్‌ గెటప్‌లో అదరగొట్టేలా ఉన్నాడు. మాస్‌లో సూపర్బ్‌ ఇమేజ్‌ ఉన్న బాలయ్య, మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడం ఖాయం అనే సంగతి ఈ స్టిల్స్‌ని చూస్తేనే అర్ధమవుతోంది. 2017 సంక్రాంతికి 'గౌతమి పుత్ర శాతకర్ణి'తో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ఈ ఏడాది మరో సెన్సేషన్‌ హిట్‌ని 'పైసా వసూల్‌'తో కొట్టబోతున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కసిగా పనిచేశాడట పూరి జగన్నాథ్‌ ఈ సినిమా కోసం. పూరి గత చిత్రాలు నిరాశపర్చడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలా అయినా హిట్‌ కొట్టాలన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు పూరీ.

ALSO READ: 'రారండోయ్‌..'తో నిర్మాతగా హ్యాట్రిక్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున