ENGLISH

తేజ డైరెక్షన్‌లో బాలయ్య పొలిటికల్‌ మూవీ?

16 September 2017-15:18 PM

2019 ఎలక్షన్స్‌కి ముందే డైరెక్టర్‌ తేజ పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఓ సినిమా చేసి విడుదల చేయాలనుకుంటున్నాడట. అది ఖచ్చితంగా స్టార్‌ హీరోతోనే చేయాలని భావిస్తున్నాడట తేజ. వరుస పరాజయాలతో ఉన్న తేజ బండి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో గాడిన పడింది. దాంతో తేజపై పెద్ద నిర్మాతల దృష్టి పడింది. తేజ కూడా ట్రాక్‌ మార్చేశాడు. ఇకపై స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. ఆ లైన్‌లో ముందుగా ఉన్నది హీరో బాలయ్య, ఇప్పటికే బాలయ్య కోసం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడట తేజ. బాలయ్య ఎలాగూ ఎన్టీఆర్‌ జీవిత గాధ ఆధారంగా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ తరుణంలో తేజ తాను సిద్ధం చేసిన స్క్రిప్టుతో బాలయ్య వద్దకు వెళ్లారనీ, ఆ కథకి బాలయ్య ఓకే అన్నారనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుండో తేజకి కోరిక. ఆ కోరిక ఈ రకంగా నెరవేరనుందనే అనిపిస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చూశాక, తేజపై నమ్మకం కూడా కుదిరింది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే తెరకెక్కింది. అయితే ఇది జస్ట్‌ టీజర్‌లాంటిది మాత్రమే. అసలు పొలిటికల్‌ డ్రామా ముందు ముందు చూపిస్తాననే కాన్ఫిడెన్స్‌తో తేజ ఉన్నాడనీ ఆయని సన్నిహితుల నుండి అందుతున్న సమాచారమ్‌. మొత్తానికి అన్నీ కుదిరితే ఎలక్షన్స్‌కి ముందే తేజ కొత్త సినిమాతో ఓ ప్రభంజనం సృష్టిస్తాడనిపిస్తోంది.

ALSO READ: వర్మ కి వార్నింగ్ ఇచ్చిన రేవతి