ENGLISH

హీరో వేషాలేస్తాడ‌ట‌.. జ‌నం చూస్తారా?

08 July 2021-16:00 PM

హాస్య న‌టుడిగా, నిర్మాత‌గా కంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు బండ్ల గ‌ణేష్‌. సెవ‌న్ ఓ క్లాక్ బ్లేడు ఉదంతంతో.. త‌ను మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. ఈమ‌ధ్య న‌ట‌న‌పై ఆయ‌న దృష్టి పెంచారు. `స‌రి లేరు నీకెవ్వ‌రు` సినిమాలో కామెడీ వేషం వేసినా, పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. పైగా.. త‌న సీన్లు క‌ట్ చేశార‌ని, త‌న పాత్ర‌ని కుదించి, త‌నని అవ‌మానించార‌ని, ఆయ‌న ఆవేద‌న సైతం వ్య‌క్తం చేశారు. క‌మిడియ‌న్ల మ‌ధ్య పోటీ పెర‌గ‌డంతో, ఆయ‌న‌కు కామెడీ వేషాలు రావ‌డ‌మే క‌ష్ట‌మైపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా హీరోగా చేసే ఛాన్స్ వచ్చింద‌ట‌.

 

వెంకట్‌ అనే కొత్త దర్శకుడు బండ్ల గ‌ణేష్ కోసం ఓ క‌థ సిద్ధం చేశార్ట‌. ఆ క‌థ గ‌ణేష్‌కి బాగా న‌చ్చింద‌ని, తానే నిర్మాత‌గా ఈ సినిమా చేయ‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంద‌ట‌. క‌మిడియ‌న్లు హీరోలుగా మార‌డంలో పెద్ద‌గా విచిత్రం ఏమీ లేదు. కాక‌పోతే.... గ‌ణేష్ కామెడీ వేషాలేసి చాలా కాలం అయ్యింది. ఆయ‌న్ని క‌మెడియ‌న్ గానూ జ‌నం మ‌ర్చిపోయారు. ఈ ద‌శ‌లో.. హీరోగా చేస్తానంటే జ‌నం చూస్తారా? ఆదరిస్తారా? అనేది అన్నింటికంటే పెద్ద డౌటు. దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

ALSO READ: వెంకీ మామ కోసం వెనుక‌డుగు వేసిన చైతూ