ENGLISH

విషాదం: బ‌ప్పీల‌హ‌రి... క‌న్నుమూత‌

16 February 2022-10:00 AM

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి (69) క‌న్నుమూశారు. ఈరోజు ఉదయం అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ప‌నిచేసిన బ‌ప్పిల‌హ‌రి.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ బాణీలు అందించారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, కృష్ణ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు ప‌నిచేశారు. సింహాసనం, గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ తెలుగు సినిమాలకు బప్పి లహిరి సంగీత దర్శకత్వం వహించారు.

 

బ‌ప్పీల‌హ‌రి అస‌లు పేరు అలొకేష్ ల‌హ‌రి. సంగీత కుటుంబంలో పుట్టారు. త‌ల్లిదండ్రులిద్ద‌రూ గాయ‌కులే. మూడేళ్ల వ‌య‌సులోనే త‌బ‌లా నేర్చుకున్నారు. 1973లో న‌న్హా షికారీ అనే సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా మారారు. దాదాపు వంద చిత్రాల‌కు ప‌నిచేశారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో కొవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయ‌న ఆరోగ్యం స‌రిగా ఉండ‌డం లేదు. చాలా కాలంగా ఆయ‌న మంచానికే ప‌రిమిత‌మ‌య్యారు.

ALSO READ: అన‌సూయ‌కు మైన‌స్సేనా?