ENGLISH

బిగ్‌బాస్‌కి హైలైట్‌ గ్లామర్‌ షో

16 September 2017-19:18 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోకే హైలైట్‌ గ్లామర్‌ని యాడ్‌ చేస్తున్నారు. 'జై లవ కుశ' సినిమా ప్రమోషన్‌ కోసం ఇద్దరు అందాల భామలు బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి అటెంట్‌ అయ్యారు. ఈ ఇద్దరు అందాల భామలు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయి, హౌస్‌మేట్స్‌తో 'జై లవకుశ' సినిమా ముచ్చట్ల గురించి వివరిస్తారు. హౌస్‌మేట్స్‌కీ, తద్వారా ఆడియన్స్‌కీ ఆ ముద్దుగుమ్మలు చెప్పే ఆ కబుర్లెలా ఉంటాయో తెలియాలంటే షో ప్రసారమయ్యేదాకా వేచి చూడాలి. ఆ అందాల భామలు ఎవరో కాదు 'జై లవ కుశ' సినిమాలో హీరోయిన్లుగా నటించిన రాశి ఖన్నా, నివేదా థామస్‌. ఈ ఇద్దరు భామలూ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అవుతుండడం చాలా ఆనందంగా ఉందంటూ అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ ఇద్దరికీ ఇదొక కొత్త అనుభవం. హౌస్‌ లోపలేమో హీరోయిన్లు, హౌస్‌ బయట హోస్ట్‌గా హీరో ఎన్టీయార్‌ సందడి చేయడం బుల్లితెర వీక్షకులకూ వెరైటీ అనుభూతి అని చెప్పక తప్పదు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా కోసం రానా, 'బిగ్‌హౌస్‌'లో సందడి చేయగా, తాప్సీ తదితర సినీ ప్రముఖులూ తమ సినిమాల ప్రమోషన్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో కనిపించారు. లేటెస్ట్‌గా 'బిగ్‌హౌస్‌'లో కన్పించిన సినీ ప్రముఖుడు సునీల్‌.

ALSO READ: గ్లామ్‌ షాట్‌: సెక్సప్పీల్‌ అంతా ఆ చూపులోనే