ENGLISH

తొలిరోజు బాక్సు బ‌ద్ద‌లు కొట్టిన భీమ్లా నాయ‌క్‌

26 February 2022-15:38 PM

అనేక అంచ‌నాల మ‌ధ్య భీమ్లా నాయ‌క్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్ లో తొలి షో తెల్ల‌వారుఝామున 4 గంట‌ల‌కే ప‌డిపోయింది. తొలి షో నుంచీ సూప‌ర్ హిట్ టాక్‌. దానికి త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్ డే క‌ల‌క్ష‌న్ల‌లో కొత్త రికార్డులు సృష్టించింది భీమ్లా నాయ‌క్‌. తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.55 కోట్ల గ్రాస్ సాధించిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌ట్టాయి. నైజాంలో రూ.12 కోట్ల‌తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఓవ‌ర్సీస్‌లో దాదాపుగా రూ.7 కోట్లు కొల్ల‌గొట్టింది. ఏపీలో టికెట్ రేట్లు త‌క్కువ ఉన్నా స‌రే.. ప‌వ‌న్ హ‌వా ముందు అది ప‌నిచేయ‌లేదు. శ‌ని, ఆది వారాలూ ఇదే జోరు కొన‌సాగుతుంది. సోమ‌వారం మ‌హా శివ‌రాత్రి సెల‌వు కూడా భీమ్లా నాయ‌క్ కి క‌లిసొచ్చే విష‌యం. ఈ నాలుగు రోజుల్లో క‌నీసం రూ.120 కోట్ల‌యినా రాబ‌డుతుంద‌ని ఓ అంచ‌నా.

 

భీమ్లా తొలిరోజు వ‌సూళ్లు:

 

నైజాం: రూ.12 కోట్లు

సీడెడ్‌: 3.30 కోట్లు

ఉత్త‌రాంధ్ర‌: 1.85 కోట్లు

ఈస్ట్‌: 1.90 కోట్లు

వెస్ట్‌: 3 కోట్లు

గుంటూరు: 90 ల‌క్ష‌లు

నెల్లూరు: 1.5 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 3 కోట్లు

ఓవ‌ర్సీస్‌: 7 కోట్లు

 

ALSO READ: బిగ్ బాస్ హౌస్‌ కాదు.. బ్రోత‌ల్ హౌస్‌