ENGLISH

భీమ్లా బిజినెస్ ఎంత‌?

19 February 2022-10:33 AM

జ‌న‌వ‌రిలో రావాల్సిన సినిమా భీమ్లా నాయ‌క్‌. ఈనెల 25న విడుద‌ల‌కు రెడీ అయ్యింది. ఈ నెల‌లో అయినా వ‌స్తుందా, లేదంటే ఏప్రిల్ కి వాయిదా ప‌డిపోతుందా? అనే డౌట్లు వినిపించాయి. కానీ ల‌క్కీగా రిలీజ్ డేట్ క్లియ‌రెన్స్ వ‌చ్చేసింది. 25నే వ‌చ్చేస్తోంది. భీమ్లా నాయ‌క్ థియేట‌రిక‌ల్ బిజినెస్ ఎప్పుడో పూర్త‌యిపోయింది. ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ లో కూడా క్లారిటీ వ‌చ్చేసింది. ఓటీటీ, శాటిలైట్ హ‌క్కుల రూపంలో భీమ్లా నాయ‌క్ కి రూ.70 కోట్ల వ‌ర‌కూ ముట్టిన‌ట్టు టాక్‌.

 

థియేట‌రిక‌ల్ రైట్స్ కింద దాదాపుగా 110 కోట్లు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్ గా చూస్తే 180 కోట్ల‌న్న‌మాట‌. ఈ సినిమా కోసం ప‌వ‌న్‌కి రూ.50 కోట్ల పార‌తోషికం ఇచ్చారు. బ‌డ్జెట్ లెక్క‌లు తీస్తే.. రూ.100 కోట్ల‌లో సినిమా పూర్త‌యిపోయింది. అంటే.. 80 కోట్లు లాభం. పెద్ద సినిమాల‌కు లాభాలు రావ‌డం కామ‌నే.కానీ విడుద‌ల‌కు ముందే.. టేబుల్ ప్రాఫిట్ రూపంలో 80 కోట్లు ద‌క్కించుకోవ‌డం విశేష‌మే. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు అందించారు. రానా కీల‌క పాత్ర‌ధారి.

ALSO READ: సన్ అఫ్ ఇండియా మూవీ రివ్యూ & రేటింగ్!