ENGLISH

‘భీమ్లానాయక్‌’ కి గుమ్మడికాయ్

18 February 2022-11:00 AM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ కి గుమ్మడికాయ్ కొట్టారు. సినిమా షూటింగ్ పూర్తయిందని చెబుతూ దర్శకుడు సెట్ లో దిగిన ఫోటోని షేర్ చేశారు. మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌.. ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్‌లో కనిపించడం, ఆయనకు విలన్ గా రానా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

 

ఇటీవల తెలుగు చిత్రాలకు బాలీవుడ్‌ మార్కెట్‌లోనూ మంచి ఆదరణ వస్తున్న కారణంగా ‘భీమ్లానాయక్’ని తెలుగు-హిందీ భాషల్లో ఫిబ్రవరి 25న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. మిగిలిన ఒక్క పాట షూటింగ్ ని పూర్తి కావడంతో ఇక ఎలాంటి అడ్డంకులు లేవనే అనుకోవాలి. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా వున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: 'ఉప్పెన' క్రేజ్ ఎన్టీఆర్ కోసమే !