ENGLISH

'బిగ్ బాస్ 2' రేటింగ్స్ దారుణంగా పడిపోయాయ్..!

21 June 2018-16:20 PM

బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ ప్రస్తుతం జరుగుతున్నది. అయితే దీనికి మొదటి సీజన్ తో పోలిస్తే TRP రేటింగ్స్ బాగా తగ్గినట్టుగా చేబుతున్నారు. అయితే దీనికి కేవలం ఒక్క కారణం కాదు అని అనేక కారణాలు ఉన్నాయంటూ ఈ షో చూస్తున్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మొదటిగా వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ సెట్ చేసిన రేంజ్ అందుకోవడం చాలా కాష్టం అలాగే హీరో నాని కూడా వ్యాఖ్యాతగా చేయబట్టి ఇప్పటికి రెండు వారాలు గడిచింది, ఆయన గురించి చెప్పాలంటే కనీసం ఇంకొక రెండు మూడు వారాలైన వేచి చూడాలి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మొదటి సీజన్ లో ఉన్నవారితో పోల్చుకుంటే ఇమేజ్ పరంగా తక్కువే అని చెప్పాలి అలాగే వారు హౌస్ లో ఉన్న తీరు కూడా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోవడం లేదు అని మాత్రం చెప్పొచ్చు.

ఇప్పటికైతే మొదటి సీజన్ కి మొదటి రెండు వారాలకి వచ్చిన TRP రేటింగ్స్ ని సీజన్ రెండు వారలతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంది అని అంటున్నారు.

 

ALSO READ: పవన్ కళ్యాణ్ కంటికి శస్త్రచికిత్స