ENGLISH

ఈ అయుదుగురిలో బిగ్ బాస్ విజేత ఎవరు?

24 September 2017-13:23 PM

బిగ్ బాస్... బిగ్ బాస్... ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎక్కడ విన్నా ఇదే పేరు. ఈరోజుతో బిగ్ బాస్ మొదటి సీజన్ ముగియనుంది. ఈ 70 రోజుల పాటు ఈ షో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది అని చెప్పాలి.

ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన విధానం, కాంట్ స్టంట్స్ ఈ షోలో పాల్గొన్న తీరు ప్రేక్షకులని ఈ రియాలిటీ షోని ఇష్టపడేలా చేశాయి. ఇప్పటికే ఇందులో పాల్గొన్నవారికి భయట అభిమానులు పెరిగిపోవడం, తమకు నచ్చిన వారిని సేవ్ చేయడానికి అందరు పోటీపడుతుండడం ఈ కార్యక్రమానికి ఎంత ఆదరణ ఉందో తెలియచేస్తున్నది.

ఇక ఈరోజు జరిగే గ్రాండ్ ఫినాలేలో మిగిలిన అయుదుగురిలో- ఆదర్శ్, అర్చన, హరితేజ, నవదీప్ & శివ బాలాజీ ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. సాయంత్రం 6 గంటలనుండే ఈ కార్యక్రమం మొదలుకానున్న నేపధ్యంలో అందరు ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పొచ్చు.

ఈ అయుదిగురిలో మీ ఓటు ఎవరికో కింద కామెంట్ బాక్స్ లో టైప్చేసి చెప్పండి.

 

ALSO READ: 100 కోట్ల క్లబ్ లో జై లవకుశ?!