ENGLISH

హర్షసాయి కేసులో కీలక మలుపు

07 October 2024-13:10 PM

యూట్యూబర్ హర్షసాయిపై ఓ మహిళా నటి, నిర్మాత చీటింగ్ కేసు, లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె కేసు పెట్టిన విషయం బయటికి రాగానే హర్ష సాయి పరారీ  అయిపోయాడు.ఇప్పటివరకు అతన్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. హర్ష సాయి ఎక్కడ ఉన్నాడో తెలియక పోవటంతో పోలీసులు కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో బాధితురాలి ఆడియో కాల్స్ రికార్డ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఆమే హర్ష సాయిని వెంట పడి వేధించినట్లు, ఆమె సాయిని ఇష్టపడి, వెంట పడినట్లు ఉన్నాయి ఆ ఆడియో రికార్డ్స్. 


హర్ష సాయికి అనుకూలంగా కొంతమంది కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారని, బాధితురాలి లాయర్  నాగూర్ బాబు, నిర్మాత బాలచంద్ర ప్రెస్ మీట్ పెట్టారు. లాయర్ నాగూర్ బాబు మాట్లాడుతూ 'ఈ కేసులో  ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడా చూపించలేదు. అసలు FIR ఎందుకోసం ఫైల్ చేశామన్నది ఎవరికీ తెలియదు. అయినా రెండు కోట్ల కోసమని ఆమె హర్ష సాయిని టార్గెట్ చెసిందని కొంతమంది యూట్యూబర్స్ ప్రచారం చేస్తున్నారని, హర్ష సాయి డబ్బులిచ్చి వారితో అలా చెప్పిస్తున్నాడని వీరు పేర్కొన్నారు. హర్ష సాయి ప్రస్తుతం దేశం విడిచి పారిపోయాడని, అయినా తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ స్టాగ్రామ్ పేజీలు పనిచేస్తున్నాయని వీరు మండిపడ్డారు.  


అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ లని, వాటిని వెంటనే డిలీట్ చేయాలని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామని,  అనవసర అభియోగాలతో బాధితురాలని మానసికంగా టార్చెర్ పెడుతున్నారని  ఇన్ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ ల పై కూడా కేసు ఫైల్ చేసినట్లు  తెలిపారు. నిర్మాత బాలచంద్ర మాట్లాడుతూ ఎంతో ధైర్యంగా వచ్చి కేసు పెట్టిన బాధితురాలిని మరికొంచెం బాధ పెడుతున్నారని, హర్ష సాయి కూడా ఇబ్బంది పెడుతున్నా డని అన్నారు.