ENGLISH

బిగ్‌బాస్‌: ఆర్మీలు, హంటర్లు అదరగొట్టేస్తున్నారహో!

07 September 2020-14:00 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 మొదలైపోయింది. ఎలా ప్రారంభిస్తారు.? అన్న ఉత్కంఠకు తెరపడింది. డబుల్‌ ఎనర్జీతో నాగ్‌ అదరగొట్టేశాడు. కొంచెం అసంతృప్తి బుల్లితెర వ్యూయర్స్‌లో నెలకొన్నప్పటికీ, సంబరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్భుతంగానే జరిగాయన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుంటే, ‘డే వన్‌’ నుంచే సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ కోసం ‘సైన్యాలు’ సిద్ధమయిపోయాయి. హంటర్స్‌ అనీ, ఆర్మీ అనీ, ఇంకోటనీ ఆయా కంటెస్టెంట్స్‌ తాలూకు బ్యాక్‌ ఎండ్‌ టీమ్స్ హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించేస్తూ తమ కంటెస్టెంట్లను ప్రమోట్‌ చేసుకుంటున్నాయి.

 

నోయెల్‌ సీన్‌, అలేఖ్య హారిక, దివి, మోనాల్‌ గజ్జర్‌, అరియానా గ్లోరీ, మొహమ్మద్‌ దిల్‌ సే, అఖిల్‌, అభిజీత్‌, జోర్దార్‌ సుజాతలకు బ్యాక్‌ ఎండ్‌ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. వీళ్ళందర్నీ తలదన్నేలా గంగవ్వ హవా కొనసాగుతుండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. టాప్‌ ఫైవ్‌ కంటెస్టెంట్స్‌ ఎవరు? అంటూ అప్పుడే పోల్స్‌ కూడా మొదలయ్యాయి. కాగా, సూర్య కిరణ్‌, కరాటే కళ్యాణి, గంగవ్వలలో ఎవరో ఒకరు ఈవారం ఎలిమినేట్‌ అయిపోతారనే అంచనాలూ కన్పిస్తున్నాయి.

 

గంగవ్వకి సెంటిమెంట్‌ కోసం ఒక్క ఛాన్స్‌ ఇస్తారనీ, కళ్యాణి లేదా సూర్య కిరణ్‌లలో ఒకరి వికెట్‌ పడుతుందనే గాసిప్స్‌ బాగా వినిపిస్తుండడం గమనార్హం. అయితే, గతంలోలా ఈసారి లీకులకు అవకాశం లేకుండా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ALSO READ: 'మహా'.. అనే అమ్మాయి కోసం.