ENGLISH

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌

20 September 2020-09:38 AM

`సత్యం`లాంటి సూప‌ర్ డూప‌ర్ మ్యూజిక‌ల్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్‌. ఆ త‌ర‌వాత క‌ల్యాణిని పెళ్లి చేసుకున్నాడు. స‌డ‌న్ గా సినిమాల‌కు దూర‌మ‌య్యాడు సూర్య కిర‌ణ్. వైవాహిక జీవితంలోనూ ఒడిదుడుకులు రావ‌డంతో క‌ల్యాణీతో విడాకులు తీసుకోవాల్సివ‌చ్చింది. సూర్య కిర‌ణ్ అనే ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌న్న సంగ‌తి అటు ప్రేక్ష‌కులు, ఇటు సినిమా వాళ్లూ మ‌ర్చిపోతున్న త‌రుణంలో బిగ్ బాస్ 4.... ఆయ‌న్ని గుర్తు చేసింది.

 

అయితే ఈ సీజ‌న్‌లో తొలి వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు సూర్య కిర‌ణ్‌. కాక‌పోతే.. ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణాన్ని మ‌ళ్లీ మొద‌లెట్టడానికి రెడీ అయ్యాడు సూర్య‌కిర‌ణ్‌. 'సూత్ర‌ధారి' అనే ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు కూడా ఎంపిక‌య్యారు. ''క‌రోనా లేక‌పోతే.. ఈపాటికి షూటింగ్ మొద‌ల‌య్యేది. ప‌రిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తా. ఇది కాకుండా మ‌రో యాభై క‌థ‌ల వ‌ర‌కూ నా ద‌గ్గ‌ర సిద్ధంగా ఉన్నాయి'' అంటున్నాడు సూర్య కిర‌ణ్‌.

ALSO READ: ఎవ‌రు ప్ల‌స్ అనుకుంటే.. వాళ్లే మైన‌స్ అయ్యారు