ENGLISH

ఇలా గొడవ, అలా స్నేహం: ఎలా సాధ్యం బిగ్‌బాస్‌!

07 November 2020-18:30 PM

ఎవరి మీదా ఎవరికీ వ్యక్తిగత ద్వేషాలుండవు. కొంత స్నేహం బిల్డప్‌ అయితే అవ్వొచ్చుగాక. బిగ్‌బాస్‌ వేదికగా కనిపించేదేదీ నిజం కాదని గతంలోనే నిరూపితమయ్యింది. అయినాగానీ, హౌస్‌లో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు.. ఇదంతా ఆ ఆట ఫార్మాట్‌లో భాగమే. సోహెల్‌ - మెహబూబ్‌ ఇప్పుడెందుకు తిట్టుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. అఖిల్‌ - సోహెల్‌ మధ్య కొన్నాళ్ళ క్రితం ఎందుకు గొడవ జరిగిందో అర్థం చేసుకోవడం కష్టమే.

 

అబిజీత్‌ - అఖిల్‌ కలిసి ‘మోనాల్‌’ కోసం గొడవపడ్డ వైనం కూడా స్క్రిప్టెడ్‌ అని తేలిపోయింది. ఆడియన్స్‌ ఆసక్తిగా చూస్తున్నారు కదా.. అని రియాల్టీ పేరుతో స్క్రిప్టెడ్‌ గొడవలు సృష్టిస్తే ఎలా? వీళ్ళు తిట్టుకుంటారు, వీకెండ్‌లో కింగ్‌ నాగ్‌ వచ్చి.. కొంత ఆజ్యం పోసి, ఆ తర్వాత క్లాసులు తీసుకుని, ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటాడు. ఇంతే కదా? నిన్నటి ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్‌ చుట్టూ పెద్ద యాగీనే జరిగింది. చివరికి అంతా మళ్ళీ నార్మల్‌ అయిపోతారు. ఈ డ్రమెటిక్‌ వ్యవహారాల వల్లే బిగ్‌బాస్‌ తన ఇమేజ్‌ని పూర్తిగా కోల్పోతోంది.

 

హౌస్‌లో కంటెస్టెంట్స్‌ కాదు, మహానటులున్నారు.. టీవీ సీరియల్‌ని మించిన నటనా ప్రతిభను ప్రదర్శించేస్తున్నారు. అప్పుడే కొట్టుకోవడం, అప్పుడే కలిసిపోవడం.. సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ మాత్రమే సాధ్యం. బిగ్‌బాస్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అదేదో నిజంగానే సీరియస్‌ అనుకుంటే, ఆడియన్స్‌ వెర్రి వెంగళప్పలవ్వాల్సిందే.

ALSO READ: ‘అది’ చూపించి క్యాష్‌ చేసుకుంటే తప్పులేదా?