ENGLISH

బిగ్‌బాస్‌ - చివరికి కరివేపాకులయ్యేది వీళ్ళే.!

19 November 2020-16:00 PM

‘మేమేదో ఆటలో భాగంగా తిట్టుకుంటాం.. అంతే తప్ప, మా మధ్య నిజంగా ఎలాంటి గొడవలూ లేవు..’ అంటున్నారు హౌస్‌ మేట్స్‌. అంతే, ఇక్కడ ‘కరివేపాకులు’ అయ్యేదెవరు? ఇంకెవరు, ప్రేక్షకులే. బిగ్‌ బాస్‌ రియాల్టీ షో అన్న పేరుకేగానీ, అక్కడ రియాల్టీ ఏమీ వుండదని గత సీజన్లలోనూ నిరూపితమయ్యింది. ఎవర్ని చెడుగా చూపించాలి.? ఎవర్ని మంచోళ్ళలా చూపించాలి.? అన్నది బిగ్‌ బాస్‌ టీం డిసైడ్‌ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే బిగ్‌ హౌస్‌లో టాస్క్‌లు జరుగుతాయి.

 

ఓట్లేసే వీక్షకులే వెర్రి వెంగళప్పలిక్కడ. అబిజీత్‌కీ అఖిల్‌కీ మధ్య ఏదో గొడవ జరిగిపోతోందంటూ ‘‘కరివేపాకు - సోఫా స్టార్‌’ అనే విమర్శలతో చెడుగుడు ఆడేస్తున్నారు ఇరువురి అభిమానులూ సోషల్‌ మీడియాలో. హారిక - సోహెల్‌ విషయంలోనూ ఇదే జరిగింది. గత సీజన్లలో కూడా ఆయా కంటెస్టెంట్ల తరఫున మద్దతుగా సోషల్‌ మీడియాలో రెచ్చిపోయినవారంతా చివరికి కరివేపాకులయిపోయారు.

 

ఇఫ్పుడు ఈ సీజన్‌కీ అదే పరిస్థితి. బిగ్‌బాస్‌లోకి ఆయా కంటెస్టెంట్స్‌ తాలూకు కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఈ విషయం అర్థమవుతుంటుంది. అయినా, అభిమానులకి లాజిక్కులు తెలియవు కదా.. పాపం, కరివేపాకులయిపోవాల్సి వస్తోంది. జస్ట్‌ సినిమాల్లో హీరో - విలన్‌ మధ్య గొడవలు జరిగినట్లుగానే బిగ్‌ హౌస్‌లోనూ కంటెస్టెంట్స్‌ తిట్టుకుంటుంటారు. సో, బిగ్‌ బిన్నర్‌ ఎవరన్నది దాదాపుగా డిసైడ్‌ అయిపోయే వుండాలి బిగ్‌ బాస్‌ టీం దృష్టిలో.

ALSO READ: ఆరు నెల‌లు ఆదిపురుష్‌కే!