ENGLISH

గంగవ్వ తోపు.. కానీ, ఆమెతోనే అందరికీ ముప్పు.!

23 September 2020-16:00 PM

బిగ్‌ హౌస్‌లో గంగవ్వ స్పెషల్‌ కంటెస్టెంట్‌. అయితే, బిగ్‌బాస్‌ ఫార్మాట్‌కీ.. గంగవ్వని కంటెస్టెంట్‌గా ఎంపిక చేయడానికీ అస్సలేమాత్రం పొంతన కుదరడంలేదు. గంగవ్వ తన వయుసుకి మించిన స్థాయిలో ‘సత్తా’ చాటేందుకు ప్రయత్నిస్తున్నా, ఆమె కారణంగా ఈ రియాల్టీ షోతో 50 ప్లస్‌ వయసున్న ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నా, ఆమె వల్ల ఇతర కంటెస్టెంట్స్‌ తీవ్రగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా ఫిజికల్‌ టాస్క్‌ వచ్చినప్పుడు, గంగవ్వ తన దమ్మెంతో చూపించిన మాట వాస్తవం.

 

కానీ, ఇక్కడ ఇతర కంటెస్టెంట్స్‌ తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ‘గంగవ్వ వుంది జాగ్రత్త..’ అంటూ ఫిజికల్‌ టాస్క్‌లో యంగ్‌ కంటెస్టెంట్స్‌ జాగ్రత్త పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారి ఆట తీరుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదొక్కటే కాదు, ఓటింగ్‌ సందర్భంలో కూడా సింపతీ గంగవ్వకి కలిసొస్తుండడంతో, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ వెనకబడి పోవాల్సి వస్తోందని బిగ్‌ బాస్‌ వ్యూయర్స్‌ భావిస్తున్నారు. గంగవ్వని ఫిజికల్‌ టాస్క్‌లలో పక్కన పెడితే మంచిదనీ, ఓటింగ్‌ పరంగానూ గంగవ్వని పరిగణనలోకి తీసుకోకూడదనేది చాలా మంది వాదన. కానీ, అది సాధ్యమయ్యే పని కాదు.

 

ఇప్పుడు జరుగుతోన్న ఫిజికల్‌ టాస్క్‌లో కరాటే కళ్యాణి వుంటే, అది ఖచ్చితంగా ఏదో ఒక టీమ్కి అడ్వాంటేజ్‌ అయ్యేది. గంగవ్వ కారణంగా రెండు టీములూ (హ్యామన్స్‌, రోబోట్స్‌) నష్టపోతుండడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. ఆయా కంటెస్టెంట్స్‌ ఫాలోవర్స్‌ కూడా, తమ కంటెస్టెంట్స్‌కి గంగవ్వ కారణంగా నష్టం జరుగుతోందని వాపోతున్నారు.

ALSO READ: సెగ‌లు పుట్టించ‌బోతున్న చంద‌మామ‌.