ENGLISH

Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోసం మూడు సినిమాలు రెడీ

06 October 2022-10:02 AM

ఈమ‌ధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. అందులో భాగంగానే పోకిరి, జ‌ల్సా, చెన్నకేశ‌వ రెడ్డి సినిమాలు విడుద‌ల అయ్యాయి. ఇప్పుడు ప్ర‌భాస్ వంతు వ‌చ్చింది. అక్టోబ‌రు 23 ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ పాత సినిమాల బూజు దులిపి, ఫోర్ కె కోటింగ్ ఇచ్చి రిలీజ్ చేయ‌బోతున్నారు. అందుకోసం మూడు సినిమాలు రెడీ అయ్యాయి. రెబ‌ల్‌, వ‌ర్షం, బిల్లా చిత్రాల్ని ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్నారు.

 

అక్టోబ‌రు 15న రెబ‌ల్ వ‌స్తోంది. అక్టోబ‌రు 19న వ‌ర్షం, 23న బిల్లా రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. బిల్లా, వ‌ర్షం ఓకే.. ఈ రెబ‌ల్ ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే రెబ‌ల్ ఫ్లాప్ సినిమా. దాన్ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ళ్లీ ఎందుకు చూస్తారు? ఛ‌త్ర‌పతి, డార్లింగ్‌, మిర్చి లాంటి సినిమాలు ఉండ‌గా... పోయి పోయి రెబ‌ల్ ని మ‌ళ్లీ రిలీజ్ చేయ‌డం ఎందుకో మ‌రి..? ఈ విష‌యంలోనిర్వాహ‌కులు కాస్త ఆలోచిస్తే మంచిదేమో..?

ALSO READ: స్వాతిముత్యం మూవీ రివ్యూ &రేటింగ్!