అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె మాటలు కాదు కదా. అందుకే, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ని బాలీవుడ్ మీడియా వదలడంలేదు. జాన్వీ ఎక్కడికి వెళుతోంది? ఏం చేస్తోంది? అనే విషయాల్ని ఎప్పటికప్పుడు కవర్ చేసేందుకు బాలీవుడ్ మీడియా పోటీ పడ్తోంది. ఎందుకంటే ఆమె కాబోయే హీరోయిన్. ఎప్పుడెప్పుడు ఆమె ఎంట్రీ ఇవ్వబోతోందా అంటూ ఎదురు చూస్తున్నారంతా. అందుకే జాన్వీ ఎక్కడికి వెళ్ళినా బాలీవుడ్ మీడియా కెమెరాలు ఆమెను వెంటాడుతున్నాయి. ఆమెకే కాదు ఆమె తల్లి అలనాటి నటి శ్రీదేవిని కూడా బాలీవుడ్ మీడియా వెంటాడుతూనే ఉంది ఈ విషయంలో. దాంతో 'నా కుమార్తెకు సంబంధించిన సినీ విశేషాలు త్వరలోనే వెల్లడిస్తాను. అప్పటిదాకా ఆమెకు ప్రైవసీ ఇవ్వండి' అని శ్రీదేవి విజ్ఞప్తి చేసినా బాలీవుడ్ మీడియా తన పని తాను చేసుకుపోతూనే ఉంది. జాన్వీ ఇంతవరకు మీడియాతో మాట్లాడలేదుగానీ మీడియాకి ఆమె డైరెక్ట్‌గానో ఇన్‌డైరెక్ట్‌గానో అందిస్తోన్న ఫొటోలు ఆమెపై హైప్‌ని పదింతలు చేసేస్తున్నాయి. శ్రీదేవి అంటే తెలుగు, తమిళ, హిందీ సినీ రంగాల్ని ఓ ఊపు ఊపేసిన అందాల తార. కాబట్టే జాన్వీకి ఈ స్థాయిలో హైప్. ఆమె హీరోయిన్ అయ్యేవరకూ ఆమె ఊరుకున్నా, మీడియా మాత్రం ఊరుకునేలా లేదు. అందుకే వద్దన్నా జాన్వీ వెంట పడకుండా ఉండరు. ఇంతకీ జాన్వీ సినీ ఎంట్రీ ఎప్పుడు? ఇదిప్పటికైతే సస్పెన్సే.
ALSO READ: అభిమానులకి మహేష్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా?