బోయపాటి శ్రీను సినిమాలన్నీ ఒకే లెక్కలో సాగుతాయి. హీరోయిజం ఆకాశానికి తీసుకెళ్తారాయన. క్యారెక్టర్లో రెండు మూడు డైమెన్షన్స్ ఉంటాయి. విలన్ గ్యాంగు, వాళ్లని హీరో తుక్కు రేగ్గొట్టడం ఇవన్నీ కామన్ గా కనిపిస్తాయి. ఆయనదంతా ఎమోషనల్ ప్లే. అయితే... తొలిసారి బోయపాటి ఓ పిరియాడిక్ డ్రామాని ఎంచుకున్నాడట.అది కూడా అల్లు అర్జున్ కోసం.
అఖండతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు బోయపాటి శ్రీను. త్వరలోనే అల్లు అర్జున్ తో ఓసినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ కథ కూడా లాక్ అయిపోయిందట. ఇదో పిరియాడికల్ డ్రామా అని. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగబోతోందని, బన్నీని ఓ దేశ భక్తుడిగా చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇలాంటి జోనర్ని బోయపాటి ఇప్పటి వరకూ టచ్ చేయలేదు. సరైనోడు తరవాత వీళ్ల కాంబోలో రాబోతున్న సినిమా ఇది. భారీ అంచనాలు ఉంటాయి. అందుకే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బోయపాటి. పుష్ప 2 షూటింగ్ అవ్వగానే... బోయపాటి కి డేట్లు ఇవ్వబోతున్నాడు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి.
ALSO READ: 'పుష్ప' మూవీ రివ్యూ & రేటింగ్