ENGLISH

బ‌న్నీ కోసం రూటు మార్చిన బోయ‌పాటి

09 February 2022-11:00 AM

అఖండ‌తో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు బోయ‌పాటి శ్రీ‌ను. ఇప్పుడు బోయ‌పాటితో సినిమా అంటే... మ‌ళ్లీ పెద్ద హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అంద‌రికంటే ముందే.. అల్లు అర్జున్ క‌ర్చీఫ్ వేశాడు. త్వ‌ర‌లోనే... బోయ‌పాటి, బ‌న్నీ కాంబోలో ఓసినిమా రావ‌డం ఖాయం. కాక‌పోతే... దానికి కాస్త టైమ్ ప‌డుతుంది. అయితే ఈలోగా.. బోయ‌పాటి క‌థ రెడీ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

 

బ‌న్నీతో సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉండాల్సిందే. పుష్ప‌కి వ‌చ్చిన వ‌సూళ్లు చూశాక‌... క‌చ్చితంగా ద‌ర్శ‌కుల మైండ్ సెట్ మారి ఉంటుంది. బోయ‌పాటి స్కూలు ఎప్పుడూ ఒక్క‌టే. ఊర మాస్‌.. ఊర యాక్ష‌న్‌. అయితే పాన్ ఇండియా లెవ‌ల్ లో సినిమా తీయాలంటే...దానికి అనుబంధంగా ఇంకా ఏదో ఉండాలి. పుష్ప మాస్ కావొచ్చు గానీ, దాని చుట్టూ ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ అనే నేప‌థ్యం కొత్త‌గా అనిపించింది. దానికి తోడు... హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఆక‌ట్టుకుంది. అందుకే బోయ‌పాటి కూడా పాన్ ఇండియా లెక్క‌ల‌కు త‌గ్గ‌ట్టుగా త‌న స్క్రిప్టుని మార్చుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. బ‌న్నీ కోసం ఇది వ‌ర‌కే ఓ లైన్ త‌యారు చేసినా, పుష్ఫ త‌ర‌వాత‌.. ఆ అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు, చేర్పులూ చేశాడ‌ని తెలుస్తోంది.

ALSO READ: ప‌వ‌న్ కోసం మ‌రోసారి 'పెన్ను'సాయం