ENGLISH

సినారె అస్తమయం

12 June 2017-10:13 AM

ప్రముఖ కవి, జ్ఞానపీట పురస్కార గ్రహీత డా. సి నారాయణ రెడ్డి (85) ఇక లేరు.

తీవ్రమైన శ్వాసకోశ వ్యాదితో భాదపడుతున్న ఆయన ఈ ఉదయం హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన సినారేగా ప్రసిద్ధి పొందారు .

ఈయన స్వస్థలం తెలంగాణలోని హనుమాజీపేట్ గ్రామం. అధ్యాపకుడిగా జీవితం మొదలుపెట్టి ఉస్మానియా, నిజాం, తెలుగు వర్సిటీలో పనిచేశారు. ఆ తరువాత ఆయన 1962లో గులేబకావళి కథ చిత్రంతో ఆయన చలనచిత్ర పరిశ్రమలో పాటల రచయతగా అడుగుపెట్టారు.

 

సినారె రాసిన విశ్వంభరకి ఆయన జ్ఞానపీట్ పురస్కారాన్ని 1988లో అందుకున్నారు. ఇక భారత ప్రభుత్వంచే ఆయన పద్మశ్రీ (1977), పద్మ భూషణ్ (1992) పొందారు.  అరుంధతి చిత్రంలో  ‘జేజ్జమ్మా’ అనే పాట ఆయన చిత్రాల కోసం రాసిన చివరి పాట.

ఆయన మృతికి iqlikmovies తరపున తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేస్తున్నాము. ఇక ఆయన మరణం తెలుగు సాహిత్యానికి పూడ్చలేని లోటు.