ENGLISH

ఫొటో విత్‌ 'నేనే రాజు..' అదుర్స్‌

19 July 2017-17:35 PM


'నేనే రాజు నేనే మంత్రి' సినిమా పబ్లిసిటీని వినూత్నంగా చేపడుతోంది చిత్ర యూనిట్‌. హీరో రానా, సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు. తన కటౌట్‌తో కూడిన ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ఆ ఫొటోతో ఎవరైనా తమ ఫొటోని మిక్స్‌ చేసి పంపించవచ్చునని అందులో పేర్కొన్నాడు. దాంతో కుప్పలు తెప్పలుగా అభిమానులు రానాతో కలిసి ఉన్నట్లుగా ఫొటోల్ని గ్రాఫిక్స్‌లో మిక్స్‌ చేసి సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచీ ఈ కాన్సెప్ట్‌కి మంచి స్పందన వస్తోంది. 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సీరత్‌ కపూర్‌, రానాతో కలిసి ఉన్నట్లుగా ఓ ఫొటోని డిజైన్‌ చేయించుకుని తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసుకుంది. సీరతే కాదండోయ్‌, మీలో ఎవరైనా కూడా ఇలా డిజైన్‌ చేసుకోవచ్చు. ఇంకేం ముఖ్యమంత్రి జోగేంద్ర సార్‌తో మీరు ఓ ఫోటో దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేస్కోండి, హర్రీ అప్‌. ఏది ఏమైనా రానా తెలివి తేటలు అదిరిపోయాయ్‌ కదా. తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తెరకెక్కింది. కాజల్‌ అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా కాజల్‌కి తెలుగులో తొలి అవకాశమిచ్చింది దర్శకుడు తేజ. తేజ దర్శకత్వంలో కాజల్‌ నటించిన సినిమా 'లక్ష్మీ కళ్యాణం' మళ్లీ ఇన్నాళ్లకి తేజ డైరెక్షన్‌లో కాజల్‌ నటిస్తోంది. కాజల్‌కి హీరోయిన్‌గా 'నేనే రాజు నేనే మంత్రి' 50వ సినిమా కావడం విశేషం.

 

ALSO READ: పూరి జగన్నాధ్ ఇన్వెస్టిగేషన్ అప్ డేట్స్