ENGLISH

చిరు గుండు... సీక్రెట్ తెలిసింది.

24 September 2020-15:00 PM

చిరంజీవి ఈమ‌ధ్య గుండు లుక్ ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. చిరు ఎప్పుడూ ఇలా గుండావ‌తారంలో క‌నిపించ‌లేదు. తెర‌పై ఆయ‌న క్రాఫు ఎప్పుడూ చెక్కు చెద‌ర‌లేదు. దాంతో చిరు గుండు గెట‌ప్ దేని కోస‌మా? అని అంతా ఆరా తీశారు. చివ‌రికి ఈ గుండు వెనుక ఉన్న సీక్రెట్ తెలిసింది. ఈ గెట‌ప్ త‌న కొత్త సినిమా కోస‌మే అన్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. చిరు `వేదాళం` రీమేక్ కి ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే.

 

మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే వేదాళం క‌థ‌ని చిరు ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా మార్చేశాడు మెహ‌ర్‌. చిరుతో సిట్టింగ్ కూడా వేశాడు. చిరుకి మెహ‌ర్ చేసిన మార్పులూ, చేర్పులూ బాగా న‌చ్చాయి. మెహ‌ర్ ఈ పాత్ర‌ని చాలా స్టైలీష్‌గా మార్చేశాడ‌ట‌. అందులో భాగంగానే చిరుని గుండులో చూపించాల‌ని ఫిక్సయ్యాడ‌ట‌. ఈ ఆలోచ‌న చిరుకి న‌చ్చ‌డం, వెంట‌నే ఫొటో షూట్ చేయించి, గుండు గెట‌ప్ ఎలా ఉంటుందో చూసుకోవ‌డం జ‌రిగిపోయాయి. ఈ లుక్ కి పాజిటీవ్ స్పంద‌న రావ‌డంతో.. ఇదే అవ‌తారాన్ని ఫిక్స్ చేయాల‌ని చిరు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ALSO READ: అవ‌న్నీ రూమ‌ర్లే అంటున్న ర‌కుల్