ENGLISH

కోలీవుడ్ డైరెక్టర్ ని కూడా లైన్ లో పెట్టిన చిరు

23 December 2024-17:43 PM

మెగాస్టార్ చిరంజీవి జోరుపెంచారు. ప్రస్తుతం 'విశ్వంభ‌ర' మూవీ చేస్తున్న చిరు సంక్రాంతి బరిలో నిలవాల్సి ఉండగా సడెన్ గా తప్పుకున్నారు. నెక్స్ట్ సమ్మర్ కి కర్చీఫ్ వేశారు. విశ్వంభర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవటంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టి వరుస సినిమాలు లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే శ్రీ కాంత్ ఓదెలతో ఒక మూవీ, అనిల్ రావిపూడితో ఇంకొక మూవీ కమిట్ అయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ చిరుకి బ్లాక్ బస్టర్స్ తెస్తాయని నమ్మకంగా  ఉన్నారు.

ఇప్పడు ఇంకో కోలీవుడ్ డైరక్టర్ చిరు కోసం కథ సిద్ధం చేసినట్లు సమాచారం. అతనే మిత్ర‌న్. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లు రూపొందించడంలో మిత్ర‌న్ స్పెష‌లిస్ట్. విశాల్ తో 'అభిమన్యుడు', శివ కార్తికేయ‌న్ తో 'హీరో', కార్తీతో స‌ర్దార్ అనే స్పై థ్రిల్లర్ తెర‌కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజంట్ మిత్రన్ కార్తీతో 'స‌ర్దార్ -2' తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పడు మిత్రన్ చిరు కోసం కథ రాయగా, ఆ స్టోరీ లైన్ నచ్చి చిరు ఓకే చెప్పారని, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు టాక్.

మిత్ర‌న్ సినిమాలో హీరోయిజం డిఫరెంట్ గా ఉంటుంది. నిజంగా మిత్రన్ కథకి చిరు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు. ప్రస్తుతం చిరంజీవి వైవిధ్యమైన కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ జూనియర్ లెక్కలు వేయకుండా వారి ప్రతిభ ఆధారంగా ఛాన్స్ లు ఇస్తూ ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి చిరు, మిత్రన్ కలిసి కొత్త ప్రయోగానికి నాంది పలుకునున్నారు.