ENGLISH

Chiranjeevi, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాలించే రోజు రావాలి : చిరంజీవి

05 October 2022-11:32 AM

గాడ్ ఫాదర్ లో ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ ఓ డైలాగ్‌ను చిరంజీవి ట్వీట్‌ చేయడం చర్చకుదారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా గా జరిగిన ప్రెస్ మీట్ లో ఆ డైలాగులను గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.దీనికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు చిరు, ఆ డైలాగులు విని ఎవరైనా భుజనాలు తడుముకుంటే తానేమీ చేయలేన వ్యాఖ్యానించారు. అంతేకాదు భవిష్యత్‌లో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు అంకితభావం కలిగిన నాయకుడు అవసరమని.. ఆ అవకాశాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు,. ''ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ, నాయకులను ఉద్దేశించి డైలాగ్‌లు వేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఒరిజినల్‌లో ఉన్న దాన్నే ఇక్కడ తెలుగు వారికి చేరువయ్యేలా రాశాం. పొలిటికల్‌గా సెటైర్లు వేయాలని మేము ఎప్పుడూ భావించలేదు. కథ ఆధారంగానే డైలాగ్‌లు రాశాం. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేను. నా తమ్ముడు నిబద్ధత కలిగిన వ్యక్తి. నిబద్ధత ఉన్న నాయకుడు రావాలి. అందుకు నా సపోర్ట్‌ తమ్ముడికి ఉంటుంది. పరిపాలించే అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ప్రజలు తనకి ఇస్తారనే అనుకుంటున్నా. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చారు చిరు.

ALSO READ: ఆదిపురుష్‌ తో మాకెలాంటి సంబంధం లేదు!