ENGLISH

మేనల్లుడు కాదు, ఈసారి చిన్నల్లుడొస్తున్నాడు

24 September 2017-11:16 AM

చిరంజీవి ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌. చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌. ఈయనకి మొదట్నుంచీ నటనపై ఆశక్తి ఉంది. ఆ ఆశక్తే ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రోత్సహించింది. అంతేకాదు చిరంజీవి ఫ్యామిలీ నుండి కూడా ప్రోత్సాహం ఉండడంతో కళ్యాణ్‌ తన కోరికను తీర్చుకోబోతున్నాడంటున్నారు. వైజాగ్‌లోని స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ దగ్గర నటనలో కళ్యాణ్‌ శిక్షణ తీసుకుంటున్నాడనీ సమాచారమ్‌. సత్యానంద్‌ చిరంజీవికి ఎంతో ఆప్తులు. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆయన దగ్గరే శిక్షణ పొందారు. పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌లతో పాటు, ప్రబాస్‌, మహేష్‌, రవితేజ తదితరులు కూడా సత్యానంద్‌ దగ్గర శిక్షణ పొందినవారే. అలాంటి సత్యానంద్‌ దగ్గర శిక్షణ పొందుతున్నాడంటే ఖచ్చితంగా యాక్టింగ్‌లో పట్టా సాధించే వస్తాడు కళ్యాణ్‌. ఇటీవలే ఓ ఫోటో సెషన్‌లో కూడా పాల్గొన్నాడు కళ్యాణ్‌. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలు చూశాక కళ్యాణ్‌ని యాక్టర్‌గా ఏక్‌సెప్ట్‌ చేసేందుకు అభిమానులు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుండి టాలెంటెడ్‌ హీరోలు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇటీవలే మెగా ఫ్యామిలీ నుండి మొట్టమొదటి హీరోయిన్‌గా నిహారిక కూడా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలతో త్వరలోనే చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ ఎంట్రీ కూడా షురూ కానుందన్న మాటే!

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్