ENGLISH

సుకుమార్ ద‌ర్శక‌త్వంలో చిరు

23 February 2022-10:31 AM

చిరంజీవి - సుకుమార్‌.. ఆహా.. ఏం కాంబినేష‌న్ క‌దా? ఇలాంటి కాంబినేష‌న్ ని చూడాల‌నే అభిమానులు కోరుకుంటుంటారు. సుకుమార్ ఆశ‌, క‌ల‌ కూడా అదే. చిరంజీవి ముందు కెమెరా పెట్టి, `యాక్ష‌న్‌..` చెప్పాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. `రంగ‌స్థ‌లం` త‌రవాత చిరంజీవి - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌ని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఆ క‌ల నిజ‌మైంది. చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేసేశాడు. కాక‌పోతే,... అది సినిమా షూటింగ్ కాదు.యాడ్ ఫిల్మ్ కోసం.

 

వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు చిరు. భోళా శంకర్‌, గాడ్ ఫాద‌ర్ తో పాటు బాబి సినిమా కూడా ఒకేసారి రూపుదిద్దుకుంటోంది. మ‌రోవైపు ఆచార్య విడుద‌ల‌కు రెడీగా ఉంది. వీటి మ‌ధ్య ఓక‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేసేశాడు చిరు. దానికి సుకుమార్ ద‌ర్శ‌కుడు. ``మెగాస్టార్ కోసం మెగాఫోన్ ప‌ట్టా. నా క‌ల నిజ‌మైంది. వివ‌రాలు త్వ‌ర‌లో`` అంటూ సుకుమార్ ఓ ట్వీట్ చేశాడు. దాంతో... విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఆ యాడ్ ఏమిటి? ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుంది? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

ALSO READ: రాధే శ్యామ్ లో 'బిగ్' ఎట్రాక్షన్ !