ENGLISH

చిరు చెల్లెలి కోసం పోటీ

15 October 2020-10:00 AM

త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వేదాళం`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో క‌థానాయ‌కుడి చెల్లెలిది కీల‌క‌మైన పాత్ర‌. ఆ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌వి పేరు ప‌రిశీలించారు. ఆమెనే ఖ‌రారు చేశార‌న్న వార్త‌లొచ్చాయి. ఇప్పుడు మ‌రో క‌థానాయిక పేరు కూడా ప‌రిశీలిస్తున్నార్ట‌. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు రేసులోకి వ‌చ్చింద‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ టాక్‌.

 

సాయిప‌ల్ల‌వి, లేదా కీర్తిల‌లో ఎవ‌రినో ఒక‌రిని ఖాయం చేసే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు ఫుల్ బిజీ. ఎవ‌రి కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో చూసుకుని వాళ్ల‌ని చిరు చెల్లాయిగా ఫిక్స్ చేస్తార్ట‌. చిరు సినిమా అంటే ఎవ‌రైనా స‌రే, వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కాల్షీట్లు అందుబాటులో లేక‌పోయినా, స‌ర్దుబాటు చేసేస్తారు. ఛాయిస్ చిత్ర‌బృందానిదే. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి. చిరు ప్ర‌స్తుతం `ఆచార్య‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత ప‌ట్టాలెక్కే చిత్ర‌మిదే.

ALSO READ: సంక్రాంతి వ‌ర‌కూ ఆగ‌లేరట‌!