ENGLISH

చిరు Vs ప‌వ‌న్ .. పోరు త‌ప్ప‌దా?

25 May 2022-16:29 PM

అన్న చిరంజీవి బాట‌లోనే వ‌చ్చినా.. చిరు త‌మ్ముడిగానే అరంగేట్రం చేసినా, త‌న‌కంటూ ఓ ఫ్యాలోయింగ్ ని, క్రేజ్‌నీ సంపాదించుకున్నాడు ప‌వ‌న్ కల్యాణ్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ చిరు - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల సినిమాలు ఒకేసారి బాక్సాఫీసుని ఢీ కొట్టిన దాఖ‌లాలు లేవు. కానీ త్వ‌ర‌లోనే... ఈ అన్న‌ద‌మ్ముల మెగా పోరు ని చూడ‌బోతున్నామేమో అనిపిస్తోంది.

 

చిరు క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్టు 12న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకున్న‌ది ప్లాన్‌. అయితే ఇప్పుడు.. ఈ ప్లాన్ మారింది. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో... `గాడ్ ఫాద‌ర్‌`పై మ‌రింత కేర్ పెరిగింది. కాస్త ఆల‌స్య‌మైనా స‌రే, మంచి సినిమా ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో... ఇంకాస్త టైమ్ తీసుకుంటున్నారు. ఆగ‌స్టు దాటితే, ద‌స‌రాకే ఈ సినిమాని విడుద‌ల చేయాలి. ద‌స‌రా సీజ‌న్‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`ని విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ ద‌స‌రాకి... చిరు, ప‌వ‌న్‌ల సినిమాలు ఒకేసారి వ‌స్తాయి. ద‌స‌రా దాటితే.... ఈ రెండు సినిమాలూ సంక్రాంతికి షిఫ్ట్ అయిపోతాయి. సంక్రాంతికి మించిన సీజ‌న్ లేదు. పెద్ద హీరోల సినిమాల‌కు అది మంచి ఆప్ష‌న్‌. ద‌స‌రా దాటితే.. ఈ రెండు సినిమాలూ సంక్రాంతి బ‌రిలో దిగుతాయ‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: య‌శ్ ని పట్టేసిన దిల్ రాజు.. మ‌రి ద‌ర్శ‌కుడు ఎవ‌రు?