ENGLISH

ప్రభాస్-సుజీత్ ల గొడవ పైన క్లారిటీ

15 March 2018-16:33 PM

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో పైన రోజుకొక కొత్త పుకారు రావడం సర్వసాధారణం అయిపొయింది.

అందులో భాగంగానే తాజాగా వచ్చిన పుకారు ఏంటంటే- సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విధానంతో  ప్రభాస్ సంతృప్తిగా లేడు అని అందుకే దర్శకుడు రాజమౌళి, ఈ చిత్ర కెమెరామెన్ అయిన మధీ తదితరులు ఈ షూటింగ్ ని పర్యవేక్షిస్తున్నారు అని.

 

ఇదే ప్రశ్నని ఒక అభిమాని ట్విట్టర్ లో సుజీత్ ని అడగగా- మేము రోజు చాలా ఉత్సాహంగా పని చేస్తున్నాము. ఈ సమయంలో ఇలాంటి పుకార్లు మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి మాత్రమే అని తేలిగ్గా కొట్టిపారేశాడు.

ఇవ్వని పక్కన పెడితే, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని తమ ముందుకి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

 

ALSO READ: 'రంగస్థలం'కి షాకిచ్చిన గొల్లభామ!