ENGLISH

కస్టడీ మూవీ రివ్యూ & రేటింగ్

12 May 2023-11:19 AM

చిత్రం: కస్టడీ
నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిశోర్
దర్శకత్వం: వెంకట్ ప్రభు
 

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా
ఛాయాగ్రహణం: కతీర్
కూర్పు: వెంకట్ రాజన్
 

బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: 12 మే 2023

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5
 

అక్కినేని హీరోలకు గత కొన్నాళ్లుగా కలసిరావడం లేదు. నాగార్జున, అఖిల్ వరుసగా ప్లాప్స్ ఇచ్చారు. ఇప్పుడు అందరిచూపు నాగచైతన్య కస్టడీపై పడింది. ‘మనాడు’తో మంచి హిట్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘కస్టడీ పై ఆసక్తి రేపింది. మరి ఈ చిత్రం చైతుకి విజయాన్ని ఇచ్చిందా ? తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?


కథ: శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. రేవతి( కృతి శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. ప్రేమ, పెళ్లి సమస్యలతో ఇబ్బంది పడుతున్న శివ జీవితంలోకి రాజు (అరవింద స్వామి) అనే క్రిమినల్‌ రూపంలో మరో పెద్ద సమస్య వస్తుంది. ఒక ముఠా రాజుని చంపాలని చూస్తుంది. అతడిని రక్షించే భాద్యత శివపై పడుతుంది. అసలు ఆ ముఠా రాజుని ఎందుకు చంపాలని చూస్తుంది ? శివ, రాజుని కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచాడా?  లేదా ?శివలవ్ స్టొరీ ఏమైయిందనేది మిలిగిన కథ.


విశ్లేషణ: కస్టడీ కథని ప్రెస్ మీట్ లోనే చెప్పేశారు దర్శకుడు వెంకట్ ప్రభు. ‘ప్రతి సినిమాలో హీరో విలన్ చంపాలని అనుకుంటాడు. కానీ కస్టడీ లో విలన్ ని కాపాడటం హీరో భాద్యత’’ ఇదే సినిమా కథ అన్నాడు. కథని ఇంత ధైర్యంగా చెప్పారంటే కథనంలో వెంకట్ ప్రభు మ్యాజిక్ ఉంటుందని ఆయన సినిమాలు, స్క్రీన్ ప్లే తెలివి గురించి తెలిసినవారంతా అనుకున్నారు. కానీ కస్టడీ లో ఆ మ్యాజిక్ తప్పింది. ఒక సింపుల్ లైన్ తీసుకొని దాన్ని బ్రిలియంట్ స్క్రీన్ ప్లే తో ప్రజంట్ చేయడం వెంకట్ ప్రభు స్టయిల్. కానీ నాగచైతన్య కస్టడీకి వచ్చేసరికి ఆయన మార్క్ మిస్ అయ్యింది. ఊహకు అందిపోయే స్క్రీన్ ప్లే తో ఓ బలహీనమైన కథని అంతే బలహీనంగా చూపించాడు వెంకట్ ప్రభు. 


90లో జరిగే కథ ఇది. రాజమండ్రి బాంబ్ బ్లాస్ట్ ఎపిసోడ్ తో సినిమా మొదలౌతుంది. తర్వాత సాదాసీదాగా వుండే శివ రేవతిల ప్రేమ కథ అంత ఆసక్తిని ఇవ్వదు. అందులో కొత్తదనం కూడా లేదు. కస్టడీ లో ప్రధాన సమస్య ఏమిటంటే.. ఇంటర్వెల్ ముందు వరకూ కథని మొదలుపెట్టలేదు దర్శకుడు. దీంతో వ్యవహారం అంతా సాగదీతగా అనిపిస్తుంది. రాజు పాత్ర తెరపైకి రావడంతో కాస్త కదలిక వస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఫర్వాలేదనిపిస్తుంది. 


అయితే ఫస్ట్ హాఫ్ అంతా కాలయాపన చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో తన మార్కు మ్యాజిక్ చుపిస్తాడానికి ఆశపడితే నిరాశతప్పదు. ఒక సుధీర్గమైన చేజ్ సీక్వెన్స్ తో మళ్ళీ సహనానికి పరీక్షపెడతాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో ఒకే లైన్ వుంటుంది. రాజుని కోర్టుకి తీసుకువెళ్ళడం. ఇలాంటి లైన్ తో ప్రేక్షకులని యంగేజ్ చేయాలంటే స్క్రీన్ ప్లే పై బలంగా పని చేయాల్సింది. కానీ అది జరగలేదు. పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరీ బలహీనంగా వుంది. 


నటీనటులు: ఒక సాధారణ కానిస్టేబుల్ గా చాలా సహజంగా కనిపించాడు చైతు. ఓవర్ ది బోర్డ్ మాస్ ఎలివేషన్స్ జోలికి పోకుండా తన పాత్రలోనే వున్నాడు. కానీ అ పాత్రలో ఎమోషన్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చెయ్యలేకపోయాడు దర్శకుడు. అరవింద్ స్వామి లాంటి నటుడు వున్నపుడు ఆ పాత్రని గుర్తుండిపోయేలా తీర్చిదిద్దే అవకాశం వుంది. కానీ దర్శకుడు ఆయన్ని సరిగ్గా వాడుకోలేకపొయాడు. శరత్ కుమార్ పాత్ర కూడా గుర్తుపెట్టుకునేలా వుండదు. కృతి శెట్టి ఓకే అనిపిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ పండలేదు. ప్రియమణితో పాటు మిగతా నటులు పరిధిమేర కనిపించారు.  


టెక్నికల్: పాటలు సినిమాకి అడ్డు తగిలాయి. పైగా ఆ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. నేపధ్య సంగీతం మరీ అంత గొప్పగా లేదు. ఇటు ఇళయరాజా, అటు యవన్.. ఇద్దరి మార్క్ వినిపించలేదు. కతీర్ కెమరా పనితనం బావుంది. ఎడిటర్ ఇంకా షార్ఫ్ చేయొచ్చు. ఆర్ట్ వర్క్ కి యావరేజ్ మార్కులే పడతాయి. నిర్మాత కథకు కావాల్సింది సమకూర్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో వేరువేరుగా తీశామని చెప్పారు కానీ చాలా చోట్ల తమిళ వాసనలే వస్తాయి. 


ప్లస్ పాయింట్స్ :
నాగచైతన్య & తారాగణం 
కొన్ని యాక్షన్ బ్లాక్స్


మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ కథనం 
సాగదీత 
దిశ తప్పిన దర్శకత్వం 


ఫైనల్ వర్ధిక్ట్:  ప్రేక్షకుడు అరెస్ట్...