ENGLISH

మూడో 'దండుపాళ్యం'కు మీరు సిద్ధమేనా?

16 December 2017-12:23 PM

శ్రీనివాస్‌ రాజు దర్శకత్వంలో వచ్చిన 'దండుపాళ్యం', 'దండుపాళ్యం - 2' చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌లో మరో చిత్రం రాబోతోంది. అదే 'దండుపాళ్యం - 3'. అత్యంత క్రూరమైన దొంగల ముఠా ఈ తాజా దండుపాళ్యం ముఠా అట. ఇది కూడా రియల్‌ స్టోరీనే. 'దండుపాళ్యం' అనే పేరు వినగానే ఈ చిత్రం చుట్టూ వివాదాలు ముసురుకుంటాయి. 

రియల్‌గా జరిగిన స్టోరీనే అయినా కానీ స్క్రీన్‌పై మరింత క్రూరంగా, కొన్ని చోట్ల బోల్డ్‌గా తెరకెక్కించిన సన్నివేశాలతో ఈ చిత్రాలను వివాదాలు చుట్టుముట్టాయి. అయితే వివాదాలే ఈ సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ. ప్రత్యేకించి ప్రమోషన్‌ చేయనవసరం లేదు ఈ సినిమాలకి. 'దండుపాళ్యం - 2' లో ముద్దుగుమ్మ సంజన నటించింది. ఈ సినిమాలో సంజన బోల్డ్‌గా నటించిందంటూ అప్పట్లో సెన్సేషన్‌ అయ్యింది. సినిమాపై తలెత్తిన వివాదాలు ఒకెత్తు. ప్రత్యేకంగా సంజనపై తలెత్తిన వివాదాలు మరో ఎత్తు. 

సోషల్‌మీడియాలో సంజన పలు ఆరోపణలు ఎదుర్కొంది. సోషల్‌ మీడియా సాక్షిగా ఆమె ఖండించినా ఆ వివాదాలు ఆమెను చాలా కాలం వెంటాడాయి కూడా. అయితే తాజా సిరీస్‌లోని నటీ నటుల సంగతి తెలీదు. కానీ ఈ రోజు ట్రైలర్‌ విడుదల కానుంది. అంటే సినిమాకి ప్రమోషన్స్‌ స్టార్ట్‌ కానున్నాయనే చెప్పాలి వివాదాల రూపంలో. సినిమా విడుదలయ్యాక సంగతి ఎలా ఉన్నా, ట్రైలర్‌ వస్తుందంటేనే చాలు వివాదాలు పొంచి ఉంటాయి ఈ సినిమాకి. 

అయితే ఖచ్చితంగా ఈ సిరీస్‌లో గత చిత్రాలని మించిన క్రూరత్వం ఈ సినిమాలో ఉండబోతోందట. ఇక ట్రైలర్‌ వస్తే ఆ విషయంలో ఓ స్పష్టత ఎలాగూ రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాళ్లూరి రజనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ALSO READ: అనుష్క కి స్పెషల్ గిఫ్ట్ పంపిన దీపిక